calender_icon.png 18 October, 2025 | 6:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్ట్ అగ్రనేత ఆశన్న సరెండర్

17-10-2025 12:48:38 AM

-140 మంది ఉద్యమ సహచరులతో కలిసి ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ ఎదుట లొంగుబాటు

-70కిపైగా ఆయుధాలు పోలీసులకు అప్పగింత

-సహచర సభ్యులు జనజీవనంలోకి రండి : ఆశన్న పిలుపు

చర్ల, అక్టోబర్ 16: మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేశ్ జనజీవన స్రవంతిలో కలిశారు. 140మంది ఉద్యమ సహచరులతో కలిసి గురువారం ఛ త్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ ఎదుట లొంగిపోయారు.  అజ్ఞాతం వీడిన ఆశన్న, మిగతా సభ్యులు 70కి పైగా ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన మావోయిస్టులను బీజాపూర్ పోలీసులు బ స్సుల్లో తరలించారు. తెలంగాణలోని ములుగుజిల్లా వెంకటాపూర్‌కు చెందిన ఆశన్న 25 ఏళ్ల వయసులోనే మావోయిస్ట్ ఉద్యమ బా ట పట్టిన వాసుదేవరావు ఉన్నత స్థాయి దాడుల్లో కీలక వ్యక్తి. 

క్లిష్టపరిస్థితుల్లో లొంగుబాటు నిర్ణయం : ఆశన్న

జనజీవన స్రవంతిలో కలవాలనే నిర్ణ యం చాలా క్లిష్ట పరిస్థితుల్లో తీసుకున్నట్లు లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత ఆశన్న తెలిపారు. ఛత్తీస్‌గఢ్ ము ఖ్యమంత్రి ఎదుట లొంగిపోయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ముందు ఉద్యమ సహచరులు తమ భద్రతపై దృష్టిసారించాలని సూచించారు. తమను తాము కాపాడుకునేందుకు ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా పోరుబాటలో ఉన్న ఉద్యమకారులు అజ్ఞతం వీడాలని పిలుపునిచ్చారు. అందుకు తనను సంప్రదించాలని ఆశన సూచించారు.