25-01-2026 12:02:18 AM
శేరిలింగంపల్లి, జనవరి 24 (విజయక్రాంతి): మహిళలు, చిన్నారుల భద్రతను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో సైబరాబాద్ విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 23 వరకు వారం రోజుల పాటు విస్తృత చర్యలు చేపట్టినట్లు డీసీపీ సృజన కరణం తెలిపారు. --ఆపరేషన్ స్మైల్XIIలో బాలల రక్షణ -ఆపరేషన్ స్మైల్XIIలో భాగంగా సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో కమిషనరేట్ పరిధిలో జువెనైల్ జస్టిస్ చట్టం కింద 119 కేసులు నమోదు చేసి, మొత్తం 337 మంది చిన్నారులను రక్షించినట్లు వెల్లడించారు. వీరిలో 329 మంది బాలురు, 8 మంది బాలికలు ఉన్నట్లు తెలిపారు.
షీ టీం డెకాయ్ ఆపరేషన్లు వారం రోజుల వ్యవధిలో షీ టీం బృందాలు 176 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించగా, బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకర ప్రవర్తనకు పాల్పడిన 55 మందిని రెడ్ హ్యాండెడ్గా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరిలో 45 మందిపై పెటీ కేసులు నమోదు చేయగా, మిగిలిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. హెల్ప్ లైన్ సేవలపై ప్రచారం మహిళల హెల్ప్ లైన్ 181, చైల్ హెల్ప్ లైన్ 1098, డయల్ 100, సైబర్ హెల్ప్ లైన్ 1930 వంటి సేవల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి, అత్యవసర పరిస్థి తుల్లో వెంటనే సంప్రదించాలని సూచించినట్లు డీసీపీ తెలిపారు.