17-10-2025 12:21:01 AM
-కర్ణాటక సామాజిక, ఆర్థిక సర్వేకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి దంపతులు దూరం
న్యూఢిల్లీ, అక్టోబర్ 16 : ‘మా ఇంట్లో సర్వే చేయడం వల్ల ప్రభుత్వానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. మేం వెనకబడిన వర్గానికి చెందిన వ్యక్తులం కాదు. అందువల్ల ఈ సర్వేలో మేం పాల్గొనాల్సిన అవసరం లేదు’ అని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి దంపతులు కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న సర్వేకు దూరంగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఆంగ్ల మీడియాలో పలు కథనాలు వచ్చాయి.
కర్ణాటక ప్రభుత్వం ఇటీవల సామాజిక, ఆర్థిక సర్వే చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి వెళ్లి వివరాలను సిబ్బంది సేకరిస్తున్నారు. ఇటీవల బెంగళూరులోని జయానగర్‌లోని నా రాయణ ఇంటికి సిబ్బంది వెళ్లగా, వివరాలు చెప్పేందుకు నారాయణమూర్తి, ఆయన సతీమణి, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి నిరాకరించినట్లు తెలస్తుంది. తమ ఇంట్లో ఈ సర్వే చేయడం వల్ల ప్రభుత్వానికి ఏ ఉపయోగం కూడా ఉండదు’అని వారు స్వీయ ధ్రువీకరణ పత్రాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది.
ఈ పరిణామాలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. సర్వేలో పాల్గొనాలని ‘మేము ఎవ్వరినీ బలవంతం చేయడం లేదు’ అని ఇది పూర్తిగా స్వచ్ఛందంగా చేపడుతున్న గణన అని తెలిపారు. సెప్టెంబర్ 22 నుంచి ఆ రాష్ట్రంలో ఈ సర్వే జరుగుతోంది. ఈ సర్వలో రాష్ట్ర జనాభాకు సంబంధించి సామాజిక, ఆర్థిక, విద్య కుల వివరాలను సేకరిస్తున్నారు. ఇందుకు మొత్తం 60 ప్రశ్నలను రూపొందించారు. ఈ గణన కోసం రూ.420 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్లు అంచనాలు ఉన్నాయి.
ఈ సర్వేపై కర్ణాటక ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యతిరేకతలను ఎదుర్కొంటోంది. పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలు అవ్వగా, న్యాయ స్థానం వాటిని తోలిపుచ్చింది. అయితే బలవంతంగా వ్యక్తిగత వివరాలను సేకరించొద్దని, ప్రతి ఇంటినీ సిబ్బంది సందర్శించాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే సర్వేకు నారాయణ దంపతులు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.