వేడుకగా మారం జగదీశ్వర్ జన్మదినం
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): తెలంగాణ నాన్-గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ జన్మదిన వేడుకలను టీఎన్జీఓస్ హైదరాబాద్ జి ల్లా అధ్యక్షుడు విక్రమ్ కుమార్, జిల్లా కార్యదర్శి కూరాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. బల్కంపేట రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో జగదీశ్వర్ పేరిట ప్రత్యేక పూజలు చేశారు. నాంపల్లిలోని బంగారు మైసమ్మ తల్లి దేవాలయం వద్ద అన్నదానం చేశారు.
నాంపల్లిలోని టిఎన్జీఓస్ కేంద్ర సంఘ కార్యాలయ ప్రాంగణం లో కేక్ కట్ చేశారు. ముఖ్య అతిథులుగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సం ఘం అధ్యక్షులు ఏలూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బి. శ్యామ్, నాయకులు ఉపేందర్‌రెడ్డి, రామారావు, శౌకత్ హుస్సేన్ హాజరై జగదీశ్వర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే రోజు జన్మదినం జరుపుకుంటున్న కేం ద్ర సంఘ కోశాధికారి సతీమణి ఎస్ ఉమ, ఐటిఐ స్టేట్ ఫోరమ్ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డిల చేత కేక్ కట్ చేయించి, వైభవంగా నిర్వహించారు.
వేడుకల్లో టిఎన్జీఓస్ కేంద్ర సం ఘం ప్రతినిధులు కొండల్‌రెడ్డి, శైలజ, నిర్మల రాజకుమార్, నజీర్, అనూరాధ, హైదరాబా ద్ జిల్లా కార్యవర్గ ప్రతినిధులు బాల్ రాజ్, కే.ఆర్. రాజ్ కుమార్, ఖాలెద్ అహ్మద్, బి. శంకర్, వైదిక్ శ్రేష్ట, ముఖీమ్ ఖురేషి, శ్రీధర్, మురళి రాజు, కుతుబుద్దీన్, నరేందర్, రిజ్వీ; పూర్వ కార్యదర్శి జి. ప్రభాకర్ పాల్గొన్నారు.






