calender_icon.png 25 October, 2025 | 2:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోడల్ సోలార్ విలేజ్‌గా మరికల్ ఎంపిక

25-10-2025 12:00:00 AM

నారాయణపేట. అక్టోబర్24 (విజయక్రాంతి): ముఫ్త్ బిజిలి యోజన పథకం కింద మోడల్ సోలార్ విలేజ్గా నారాయణపేట జిల్లాలోని మరికల్ ఎంపికైనట్లు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మోడల్ సోలార్ విలేజ్ మోడల్ సోలార్ విలేజ్ స్కీమ్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం శుక్రవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్ కలెక్టర్ గారి చాంబర్లో జరిగింది. ఈ సమావేశంలో మరికల్ ను మోడల్ సోలార్ విలేజ్గా ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఈ పథకం దేశంలోని ప్రతి జిల్లాలో ఒక మోడల్ సోలార్ గ్రామాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుందనీ, మార్గదర్శకాల ప్రకారం, ఒక గ్రామం ఎంపికకు అర్హత పొందాలంటే 5000 కంటే ఎక్కువ జనాభా కలిగిన రెవెన్యూ గ్రామం (తాజా జనాభా లెక్కల ప్రకారం) అయి ఉండాలన్నారు. నారాయణపేట జిల్లాలో,  మార్గదర్శకాల ప్రకారం 5000 కంటే ఎక్కువ జనాభా ఉన్న జిల్లాలోని 9 గ్రామాలు పోటీకి అర్హత పొందగా,పోటీ కాలం ముగిసిన అనంతరం అన్ని గ్రామాలలో మొత్తం పంపిణీ చేయబడిన సౌర సామర్థ్యాన్ని అంచనా వేసి అన్ని అభ్యర్థుల గ్రామాలలో మరికల్ గ్రామం & మండలం దాని సరిహద్దులలో గరిష్టంగా పంపిణీ చేయబడిన సౌర సామర్థ్యాన్ని సాధించడంతో జిల్లాలోని మోడల్ సోలార్ గ్రామం కింద మరికల్ ఎంపిక చేయబడిందని కలెక్టర్ వెల్లడించారు.

మోడల్ సోలార్ విలేజ్ స్కీమ్ కింద ఎంపిక చేయబడిన మరికల్ గ్రామం & మండలాన్ని తనిఖీ చేయాలనీ, మోడల్ సోలార్ విలేజ్ స్కీమ్ మార్గదర్శకాల ప్రకారం గ్రామాన్ని సౌరశక్తితో కూడిన గ్రామంగా మార్చడానికి వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక ను తయారు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. డిపిఆర్ ఆమోదం పొందిన ఒక సంవత్సరం లోపు ప్రాజెక్టులు పూర్తిగా అమలు అయ్యేలా చూసుకోవడానికి జిల్లా స్థాయి కమిటీ క్రమం తప్పకుండా డిపిఆర్ అమలును పర్యవేక్షిస్తుందనీ ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ శ్రీరామ్ ప్రణీత్, ఎల్ డి ఎం విజయ్ కుమార్, రెడ్ కో డీ ఎం మనోహర్ రెడ్డి, ట్రాన్స్ కో డి. ఈ. నరసింహ రెడ్డి, డిపిఓ సుధాకర్ రెడ్డి తదితరులుపాల్గొన్నారు.