24-10-2025 11:33:16 PM
సిద్దిపేట క్రైమ్: మాదిగ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, వృత్తిదారులు, రిటైర్డు ఉద్యోగుల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ, సామాజిక భద్రత కోసం 'మాదిగ ఉద్యోగ జాగృతి' అనే ఆత్మగౌరవ సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నామని మాదిగ జాగృతి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ అంజయ్య మహారాజు తెలిపారు. శుక్రవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్‌లో మాదిగ ఉద్యోగ జాగృతి ఆవిర్భావ సభ కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఈ నెల 26న మధ్యాహ్నం 2 గంటలకు సిద్దిపేట విపంచి కళా నిలయంలో ఆవిర్భావ సభ నిర్వహిస్తామని చెప్పారు.