calender_icon.png 26 October, 2025 | 12:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వైద్యవిద్యలో డాక్టరేట్ పట్టా పొందిన దాచారం యువతి

25-10-2025 12:00:00 AM

గజ్వేల్, అక్టోబర్24: గజ్వేల్ మండలం దాచారం గ్రామానికి చెందిన డాక్టర్ చేతి రెడ్డి భవ్య రెడ్డి ఆర్‌ఆర్బి యూనివర్సిటీ నుండి వైద్య విద్యలో డాక్టరేట్ పట్టా పొందారు. అమెరికాలోని బో స్టన్లో ఉన్న హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన మెడికల్ స్కూల్ ‘గ్లోబల్ క్లినికల్ స్కాలర్స్ రీసెర్చ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‘లో అత్యధిక మార్కులు సాధించారు. ఈ మేరకు  ప్రముఖులు, ప్రొఫెసర్ల చే తుల మీదుగా భవ్య రెడ్డి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అందుకుంది.

దరఖాస్తు చేసుకున్న 10వేల మందిలో ఒకరు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సీటు పొందుతారని, నేను కోర్సును విజయవంతంగా పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా భవ్య రెడ్డి ఆనందాన్ని వెలి బుచ్చింది. డాక్టర్ భవ్య రెడ్డి గతంలో విజయవాడలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో బిడిఎస్ చదివి బంగారు & వెండి పథకాలను సాధించడంతోపాటు, ఆస్ట్రేలియాలోని డీకిన్ విశ్వవిద్యాలయం లో మాస్టర్స్‌పూర్తి చేశారు. ఆమె అనేక అంతర్జాతీయ జర్నల్స్కు రచయిత కూడావ్యవహరించారు.