calender_icon.png 24 August, 2025 | 10:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేధింపులు తాలా లేక మహిళా ఆత్మహత్య

23-08-2025 08:01:19 PM

సదాశివనగర్,(విజయక్రాంతి): మండలంలోని ధర్మరావుపేటకు గ్రామానికి చెందిన వడ్డే పుష్ప(40) తన గృహంలో ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు తన భర్త కిషన్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నట్టు అతని కుటుంబ సభ్యులు నిరంతరం వేధింపులకు గురి చేసేవారని వేధింపులు, మానసిక వేదనను తట్టుకోలేక మృతురాలు  ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలు బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పుష్పరాజు తెలిపారు. మృతదేహాన్ని శివపుంచినాము నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.