calender_icon.png 24 August, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎండు గంజాయి పట్టివేత

23-08-2025 08:03:49 PM

మునిపల్లి,(విజయక్రాంతి): కరెంట్ రాష్ట్రం బీదర్ లో తక్కువ ధరకు టెండికం జాయినింగ్ కనుగోలు చేసి హైదరాబాద్కు సరఫరా చేస్తున్న 500 గ్రాముల ఎండు గంజాయిని కంకోల్ టోల్ ప్లాజా వద్ద మునిపల్లి పోలీసులు పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బీదర్లోని ఇరానీ గలిలో ఎండు గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్కు తరలిస్తున్నట్టు నమ్మదగిన సమాచారం మేరకు శనివారం నాడు మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద మునిపల్లి పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.

ఈ క్రమంలో ఓ స్కూటీపై అనుమానం వచ్చి ఆపి తనిఖీ చేయగా అందులో 500 గ్రాముల ఎండు గంజాయి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో  ఎండు గంజాయిని సరఫరా చేస్తున్న మందుగుల మారుతి,   మందుగుల  అఖిల్ తేజ లను అరెస్ట్  చేసి, పట్టిబడిన ఎండు గంజాయి, ఒక స్కూటీ, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఎండు గంజాయిని సరఫరా చేస్తున్న వ్యక్తులను పట్టుకోవడం పట్ల కొండాపూర్ సిఐ సుమన్ కుమార్ మునిపల్లి పోలీసులను అభినందించారు.