calender_icon.png 20 August, 2025 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్వాడీ వ్యాపారులను తరిమికొట్టాలి

20-08-2025 01:36:43 AM

వైశ్యవికాస వేదిక ఆధ్వర్యంలో ఎల్బీనగర్‌లో నిరసన ర్యాలీ

ఎల్బీనగర్ , ఆగస్టు 19 : ’మార్వాడీ వ్యాపారి హఠావో - తెలంగాణ వ్యాపారీ బచావో’ పేరుతో వైశ్యవికాస వేదిక ఆధ్వర్యంలో వ్యాపారులు మంగళవారం ఎల్బీనగర్‌లో నిరసన ర్యాలీ నిర్వహించారు. గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ... మూడు కిలో మీటర్లు పాదయాత్ర చేసి, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ..

గతంలో తెలంగాణను ఆంధ్రా పాలకులు దోస్తే, ఇప్పుడు గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు దోస్తున్నారన్నారు. తెలంగాణ వ్యాపారులను దెబ్బతీస్తూ గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించి అరాచకం సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.

మార్వాడీ వ్యాపారులు ఆరాచకాలను ఇకపై సహించేది లేదని, తెలంగాణ నుంచి ఉరికించి కొడుతామని హెచ్చరించారు. గతం లో ఆంధ్రా పెత్తందారులను తరిమికొట్టిన చరిత్ర తెలంగాణకు ఉందని, ఇది మార్వాడీలు గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈ ర్యాలీలో వివిధ వ్యాపార సంఘాల నాయకులుపాల్గొన్నారు.