22-08-2025 07:29:16 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): గ్రంథాలయం అందుబాటులోకి తేవాలని బిజెపి మండల అధ్యక్షుడు చందూరి హన్మాండ్లు ఆధ్వర్యంలో శుక్రవారం తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా హనుమాన్లు మాట్లాడుతూ నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గ్రంధాలయం ప్రారంభించినప్పటికీ అందుబాటులోకి రాకపోవడం అదేవిధంగా పశువైద్యశాల, గ్రామపంచాయతీ శిథిలావస్థకు చేరినప్పటికీ నూతనంగా నిర్మించడం లేదు. ఇప్పుడున్న బస్టాండ్లో మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడం చాలా బాధాకరం, నసురుల్లాబాద్ బైరాపూర్, దుర్కి మిరజాపుర్, నేమలి బొమ్మందేవ్ పల్లి రోడ్లు ఇరుకుగా ఉండడం వలన తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి.
రోడ్లను వెడల్పు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు. నచుపల్లి రామాలయం, దుర్కి సోమలింగేశ్వర ఆలయం, రాజరాజేశ్వర ఆలయం, కొచ్చర మైసమ్మ ఆలయం ఈ ఆలయాల భూములను పాత రికార్డు ప్రకారం సర్వే చేయించి సరిహద్దులు ఏర్పాటు చేయాలన్నారు. ఆలయాలకు ప్రభుత్వపరంగా ఆలయానికి సంబంధించిన భూమి నీ బోర్డులు ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఆలయ భూములు కబ్జా కాకుండా చూడాలని కోరారు.