calender_icon.png 22 August, 2025 | 11:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలం

22-08-2025 07:21:58 PM

నకిరేకల్,(విజయక్రాంతి): రైతులకు అవసరమైనంత యూరియా అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి విమర్శించారు. శుక్రవారం కట్టంగూరు మండల కేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో ఆ పార్టీ మండల కమిటి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

రాష్ట్రములో 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉన్న కేవలూ 5 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందన్నారు. దీంతో రైతులకు సరిపడా యూరియా అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల అవసరాలకు  తగినంత సప్లై లేక రైతులు సహకార సొసైటీ బ్యాంకు ముందు ప్రభుత్వ ఆఫీస్ ముందు ఆధార్ కార్డు, చెప్పులతో క్యూ కడుతున్నారని ఆయన తెలిపారు. యురియా కోసం రైతులు రెండు మూడు రోజూలు పడిగాపులు కాయల్సిన దయనీయ పరిస్థితి వస్తుందన్నారు.

ఈ సమయంలో బీజేపీ కేంద్రం ప్రభుత్వం కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్టంలో రామగుండం కంపెనీ ఉన్నప్పటికీ ఇక్కడ రైతు లకు తగినంత ఇవ్వకుండా వేరే ప్రాంతానికి తరలించడం అన్యాయం అన్నారు. కేంద్ర ప్రభుత్వం పై 25తారీఖున అగ్రికల్చర్ ఆఫిస్ దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయటం జరుగుతుందని ఆయన తెలిపారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్న జయప్రదం చేయాలని ఆయన కోరారు.