22-08-2025 07:25:08 PM
నంగునూరు: గుండెపోటుతో మరణించిన నంగునూరు మండలంలోని ఖాతా గ్రామానికి చెందిన మంకి యాదయ్య కుటుంబానికి ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ అండగా నిలిచింది. ఫౌండేషన్ చైర్మన్ గాదగోని చక్రధర్ గౌడ్ తరపున బాధిత కుటుంబానికి రూ. 10,000 తక్షణ ఆర్థిక సహాయం అందజేసి ఆదుకున్నారు.
శుక్రవారం మంకి యాదయ్య కుటుంబానికి ఫౌండేషన్ ప్రతినిధి గోనెపల్లి శివప్రసాద్ గౌడ్, చక్రధర్ గౌడ్ పక్షాన ఆర్థిక సహాయన్నీ కుటుంబ సభ్యులకు అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఫౌండేషన్ ఎల్లప్పుడూ రైతులు,పేద కుటుంబాలకు సహాయం చేయడానికి ముందుంటుందని తెలిపారు.