21-11-2025 03:03:34 PM
బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు దార కళ్యాణి ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక వందేమాతరం గీతాలాపన చేశారు. వందేమాతరం గీతం రచించి 150 ఏండ్ల సందర్భoగా బెల్లంపల్లి మెయిన్ బజార్లో చేపట్టిన సామూహిక వందేమాతరం గీతాలాపనలో ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల హేమాజీ హాజరై గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశమంతట జరుగుతున్న సామూహిక వందేమాతరం గీతలాపన జరుగుతుందన్నారు. బ్రిటిష్ వాళ్లని వెళ్లగొట్టడానికి వందేమాతర గీతం అందరిలో స్ఫూర్తినిచ్చి ధైర్యాన్ని నింపిందన్నారు.ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలనలో దేశం సుభిక్షంగా మారిందన్నారు.
ఈ కార్యక్రమంలో వందేమాతరం కార్యక్రమం ఇంచార్జి పులగం తిరుపతి,జిల్లా కార్యదర్శి రాచర్ల సంతోష్ జిల్లా అధికార ప్రతినిధి చిలుముల శ్రీకృష్ణదేవరాయలు జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి గోమాస కమల జిల్లా కౌన్సిల్ సభ్యులు శనిగారపు శ్రావణ్, మాజీ కౌన్సిలర్ రాజు లాల్, నాయకులు మద్దర్ల శ్రీనివాస్, కోయల్కర్ గోవర్ధన్ జిదుల రాములు పట్టణ ఉపాధ్యక్షులు సల్లం సుమలత, పట్టణ కోశాధికారి సంతోష అగర్వాల్, కోదాటి కళావతి కార్యకర్తలు పాల్గొన్నారు.