21-11-2025 03:02:12 PM
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్ర హోం శాఖ సహాయ మాజీ మంత్రి హన్సరాజ్ గంగారం తమ్ముడు హర్ష చంద్ర గాయపడ్డారు. గురువారం రాత్రి మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ వస్తున్న క్రమంలో జైనథ్ మండలం లక్ష్మీంపూర్ గ్రామ జాతీయ రహదారిపై ఆయన వాహనానికి ప్రమాదం జరిగింది. ప్రమాదంలో హర్ష చంద్ర కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 వాహన సిబ్బంది రిమ్స్ కు తరలించారు. ఐతే ప్రమాద విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలివచ్చారు. క్షతగాత్రుని కి మెరుగైన వైద్య సేవలు అందించాలని రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ కు ఎమ్మెల్యే సూచించారు.