16-08-2024 08:26:04 PM
గజ్వేల్: గజ్వేల్ ప్రాంత మహిళలు శ్రావణ మాస రెండో శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం గజ్వేల్ పట్టణంలోని శ్రీకృష్ణ ఆలయం, శేష సాయి మోక్ష మందిరం ఆలయాల్లో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఘనంగా నిర్వహించారు. సామూహిక వ్రతాల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలను జరుపుకున్నారు. అలాగే తమ తమ ఇండ్లలో కూడా మహిళలు వరలక్ష్మీ వ్రతాలను భక్తిశ్రద్ధలతో జరుపుకొని ముత్తైదువులకు వాయినాలు పంచిపెట్టారు.