calender_icon.png 3 November, 2025 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక సొసైటీలో భారీగా అవినీతి!

03-11-2025 01:13:18 AM

  1. తవ్వాల్సింది ఒకచోట... తవ్వింది మరోచోట..
  2. ఆలుబాక సమీపంలో రూ.70 లక్షలు పైగా అక్రమ తోలకం..
  3. 300పైగా లారీల్లో ఇసుక అక్రమ రవాణా..

వెంకటాపురం(నూగూరు), నవంబర్ 2 (విజయక్రాంతి): ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలోని కొన్ని ఇసుక ర్యాంపుల్లో భారీ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో మండలంలోని ఆలుగా సమీప ప్రాంతాల్లోని రాంపుల్లో కొన్నిచోట్ల అక్రమ ఇసుక దందా యదేచ్చగా కొనసాగిందని తెలిసింది. మండల పరిధిలో గోదావరి తీరంలో పరిసర సొసైటీలకు, పట్టా భూములకు ఇసుక తరలింపుకు అనుమతులు లభించాయి.

గత వారం రోజులుగా అనుభవ సమీపంలోని ఓ ర్యాంప్ నుండి తరలించవలసిన ఇసుకను దాని సమీపంలోని మరో ఇసుక క్వారీ నుండి తరలింపు జరిగినట్లు తెలిసింది. సుమారు 300ట్రిప్పులకు పైగా లారీల ద్వారా అనుమతి ఉన్న ప్రాంతం నుంచి కాకుండా వేరే ర్యాంపు నుండి తరలించారని విషయం మండలంలో చర్చనీయాంశమైంది. ఆన్లైన్లో టిఎస్‌ఎండిసి లెక్క ప్రకారం అనుమతులు ఒక ప్రాంతం నుంచి ఉండగా ఆ ప్రాంతంలో ఇసుక లేకపోవడంతో ఆ ర్యాంపు సమీపంలోని మరో ర్యాంపు నుండి ఇసుకను అక్రమంగా తరలించారని విమర్శలు ఉన్నాయి. అక్రమంగా తరలించిన ఇసుక విలువ సుమారు రూ. 70లక్షలు ఉంటుందని సమాచారం.

ఈ అక్రమసిగా తరలింపు విషయంలో టిఎస్‌ఎండిసి అధికారితో పాటు కొందరు స్థానిక అధికారుల హస్తం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అధికారులకు తెలిసి యదేచ్చగానే ఇసుక దందా సాగుతున్నట్లు తెలిసింది. అధికారికంగా ఇసుక తరలించాల్సిన ప్రాంతం నుంచి కాకుండా లారీల ద్వారా వేరే ర్యాంపు నుండి ఇసుక తరలింపు జరుగుతుండడంతో అసలు ర్యాంపు వద్ద లారీలపై టార్పాలు కప్పే కూలీలు తమ ఉపాధి దెబ్బతింటుందని వేరే ప్రాంతంలో తరలిస్తున్న ఇసుకలారీల వద్దకు వచ్చి లారీలను అడ్డగించినట్లు  తెలిసింది.

దీంతో ఈ వ్యవహారం కాస్త ఆనోటా,ఈనోట తెలిసి బయట పడింది. లక్షల 50రూపాయల ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఏ అధికారి పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. జిల్లా స్థాయి అధికారులు ఇసుక తరలింపు పట్ల మౌనం వహిస్తుండడంతో రేజింగ్ కాంట్రాక్టర్లు తమ ఇష్టారాజ్యంగా ఇసుకను అడ్డగోలుగా తరలించేస్తున్నారు. అధికార పార్టీ అండదండలతో రేసింగ్ కాంట్రాక్టర్లు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది.

ప్రభుత్వ నిబంధన విరుద్ధంగా అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు తరలింపు జరిగిన ప్రాంతానికి కాకుండా అనుమతులు పొందిన ప్రాంతం నుండి యదేచ్ఛగా తరలించిన రేసింగ్ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని, స్థానిక కూలీలకు ఉపాధి కల్పించాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై ఇకనైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.