03-11-2025 01:15:52 AM
కన్నాయిగూడెం, నవంబర్2 (విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల ప్రజల ప్రాణాలకు ఎవరు దిక్కని ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఆదివారం రోజు కంతనపల్లి చేరువు సమీపంలో కారు మరియు భైక్ ఎదురెదురుగా డీ కోన్నాయి ఇద్దరు కూడా స్పీడ్ తక్కువగా రావడంతో సల్ఫ గాయాలతో భయటపడ్డారు. ఇలాంటి ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత వారం రోజుల క్రితం చిట్యాల గ్రామ నివాసీ బోచ్చు బక్కయ్య తన కూతుర్లను చిట్యాల రోడ్డుపై కన్నాయిగూడెం వైపు తీసుకుని వస్తున్నారు చిట్యాల ప్రధాన రహదారి ఇరువైపులా పిచ్చి మొక్కలు ముళ్ల పొదలు రోడ్డుపైకి వచ్చి ఉన్నాయి మల్కపల్లి చెరువు మూలమీద పిచ్చి చెట్లు రోడ్డుపైకి రావడంతో ఎదురుగా వస్తున్న భైక్ కనబడక కారు అతివేగంగా ఎదురుగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని డీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రనవాహనంపై వస్తున్న బొచ్చు సింధుజ (17) అనే యువతి అక్కడికక్కడె మృతి చెందింది ఈ ప్రమాదాలు కేవలం ఆర్&భీ అధికారుల నిర్లక్ష్యం వల్ల జరుతున్నాయని కన్నాయిగూడెం బీఆర్‌ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు నరెడ్ల అశోక్ అన్నారు.
తుపాకులగూడెం నుంచి ఏటూరునాగారం వరకు ఉన్న ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కన్నాయిగూడెం మండలంగా ఏర్పాటు అయి సం‘రాలు గడుస్తున్నా కన్నాయిగూడెం మండలంలో అబివృద్ది లేకపోవడంతో మండల పరిషర గ్రామాల ప్రజలు ఎలాంటి పనుల కోసమైనా సభ్ డివిజన్ ఏటూరునాగారం వెల్లవలసి వస్తుంది ఎంతటి ఎమర్జెన్సీ అయినా ఈ రహదారిపైనే పోవాలి ఈ ప్రధాన రహదారి వెంట అన్నీ బొంత పొదలు దారి మీదకు వచ్చి ఆ బొంతచెట్లు మరియు తీగలు వాహనాదారులను ఇబ్బంది పెడుతున్నాయి. దీనికి తోడు ఈ రోడ్డు మొత్తం మూల మలుపులు ఉన్నాయి. వీటి వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు దగ్గరకు వచ్చే వరకు కనిపించడం లేదు.
దీని వల్ల ఎప్పుడు ప్రమాదాలు సంభవిస్తాయేనని ప్రజలు భయపడుతున్నారు. ఈ ప్రధాన రహదారికి ఇరువైపులా దట్టమైనబొంత బొంతచెట్లు ముళ్లపొదలు పిచ్చి మొక్కలు పెరిగి ప్రయాణికులకు, పాదాచారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అసలే ఈ మార్గంలో మూల మలుపులు ఎక్కువగా ఉండగా.దీనికి తోడు ఆ మూలమలుపుల వద్ద పెద్ద పెద్ద బొంత చెట్లు, పొదలు పెరిగి ఎదురుగా వచ్చే వాహనాలు కనబడకుండా చేస్తున్నాయి భయంతో రాత్రిపగలు తిరుగుతుంటాం బొంత పొదల కారణంగా ప్రయాణం ప్రమాదకరంగా మారుతుంది. ప్రమాదం పొంచి ఉన్న పొద్దున పూట జాగ్రత్తగా వెళుతున్నాం, రాత్రి సమయంలో ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణిస్తున్నాం.
తదితర గ్రామాల నుండి ప్రజలు జిల్లా మరియు డివిజన్ కేంద్రాలకు వెళ్లాలంటే ఈ రహదారి గుండనే వెల్లాలి వివిధ రకాల అవసరాలు, బ్యాంకు పనులను, మార్కెట్, నిత్యావసర సరుకులు ఇతరత్రా పనుల కోసం ఏ వస్తువు కావాలన్నా ఈ రోడ్డు నుంచే ప్రజలు జిల్లా మరియు సబ్ డివిజన్ కేంద్రాలకే వెల్ల వలసి ఉంటుంది రాత్రి సమయంలో మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా ఉంటున్నాయి. రోజూ ఇదే రోడ్డులో వాహనాలు నడుపుకుంటూ బొంత పొదలు, పిచ్చిమొక్కలు రోడ్డుపైకి వస్తున్న చెట్ల కొమ్మల కారణంగా రాకపోకలు ప్రమాదకరంగా మారుతున్నాయి. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నాం.
టూ విలర్ మీద సాధారణ వేగంతో వెళుతున్నప్పుడు కూడా చిన్న ప్రమాదం జరిగినా ప్రాణాలు నష్టపోయేంత ప్రమాదకరంగా మారింది బొంత పొదలు తొలగిస్తే రాకపోకలు సురక్షితంగా ప్రజలు ప్రయాణాలు చేస్తారని అన్నారు మండలంలో ఇలాంటి పరిస్థితులు చాలా గ్రామాల రహదారులకు ఉన్నాయి. వెంటనే అధికారులు గ్రామల్లోని అన్ని రోడ్ల మార్గాల్లో బొంత పొలాలను పిచ్చి మొక్కలను ముళ్ల పొదలను తొలగించి ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుని ప్రయాణికులకు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేయాలి
ప్రమాదకరంగా ప్రయాణం
రాత్రిపగలు తిరుగుతుంటాం బొంత పొదల కారణంగా ప్రయాణం ప్రమాదకరంగా మారింది ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణిస్తున్నాం..ఇప్పటికైనా ఆర్.అండ్ బీ అధికారులు స్పందించి బొంత పొదలు, పిచ్చి మొక్కలు తొలగిస్తే కన్నాయిగూడెం ప్రజలకు, ఆటో కార్మికులకు, వాహనదారులకు లాభదాయకంగా ఉంటుంది లేదంటే భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు.
కన్నాయిగూడెం బీఆర్‌ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు, నరెడ్ల అశోక్