calender_icon.png 11 July, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీహెచ్‌ఎంసీలో భారీగా బదిలీలు

11-07-2025 12:55:09 AM

  1. పలువురు డిప్యూటీ, జాయింట్ కమిషనర్ల నియామకం

కమిషనర్ ఉత్తర్వులు జారీ

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 10 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సి పల్ కార్పొరేషన్ జీహెచ్‌ఎంసీ లో భారీగా అధికారుల బదిలీలు జరిగాయి. పలువురు డిప్యూటీ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లకు కొత్త పోస్టింగులు ఇస్తూ కమిషనర్ ఆర్‌వీ. కర్ణన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పదోన్నతులు పొందిన అధికారులు, ఇతర అధికారు లకు కొత్త బాధ్యతలు అప్పగించారు.

ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొ న్నారు. పదోన్నతుల అనంతరం పలువురు అధికారులకు కీలక పోస్టింగులు లభించా యి. శానిటేషన్ విభాగంలో ప్రత్యేకంగా ఇద్ద రు జాయింట్ కమిషనర్లను నియమించారు. పి. మోహన్ రెడ్డిని జాయింట్ కమిషనర్ (శానిటేషన్-I)గా, టీ.యాదయ్యను జాయిం ట్ కమిషనర్ (శానిటేషన్-II)గా నియమించారు.

ప్రస్తుతం ఎస్టేట్ ఆఫీసర్గా ఉన్న జి. ఉమా ప్రకాష్ను గోషామహల్ సర్కిల్ డిప్యూ టీ కమిషనర్గా నియమించగా, ఆమె స్థానం లో బీ.యాదయ్యను కొత్త ఎస్టేట్ ఆఫీసర్గా నియమించారు. ఖైరతాబాద్ జోన్ జాయిం ట్ కమిషనర్గా ఉన్న ఎంకెఐ.అలీని మలక్పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్గా బదిలీ చేశారు.

వీరితో పాటు ఖైరతాబాద్, యూసుఫ్గూడ, ఉప్పల్, మల్కాజిగిరి, బేగంపేట్, కార్వాన్, చందానగర్, ఎల్.బి.నగర్, మూసాపేట్ వంటి కీలక సర్కిళ్లకు కొత్త డిప్యూటీ కమిషనర్లు బాధ్యతలు చేపట్టనున్నారు. పదోన్నతి పొందినప్పటికీ, ఫలక్నుమా డీసీ సి. అరుణ కుమారి, రాజేంద్రనగర్ డీసీ కె.రవి కుమార్లు అదే స్థానాల్లో కొనసాగనున్నారు. బదిలీ అయిన స్థానాల్లో రిపోర్ట్ చేయనున్నారు.