11-07-2025 12:53:23 AM
అవి పోవడంతో ఆత్మహత్య
కూకట్‌పల్లి, జూలై 10: తెలిసిన వారి వద్ద రూ.లక్ష అప్పు చేసి, బెట్టిం గ్ యాప్‌లో పోగొట్టుకున్న వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన గంగా అనూష(27) దంపతులు. వీరికి గత ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. వెంకన్నబాబు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుండగా..
అనూష వర్క్‌ఫ్రం హోం చేస్తూ ఇంట్లోనే ఉం టున్నది. ఈ క్రమంలో బెట్టింగ్‌యాప్‌లకు అలవాటు పడిన అనూష.. తెలిసిన వారి వద్ద రూ.లక్ష అప్పు చేసి ఆన్‌లైన్‌లో బెట్టింగ్ పెట్టి పోగొట్టుకుంది.
దీంతో మనస్థాపానికి గురైన అనూష సూసైడ్ నోట్ రాసి, ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన భర్త తలుపు తట్టగా ఎంతకు తీయకపోవడంతో కుమారుడు డోర్ తీశాడు. అప్పటికే అనూష ఫ్యానుకు ఉరివేసుకొని విగతజీవిగా కనిపించింది.