10-07-2025 05:25:03 PM
ధన్వాడలో దత్తాభిషేకంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు..
మంథని (విజయక్రాంతి): అ దత్తాత్రేయ స్వామి ఆశీర్వాదాలతో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని నేడు గురు పౌర్ణమి సందర్భంగా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయంలో దత్తాభిషేకంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు(TPCC General Secretary Duddilla Srinu Babu) అన్నారు. గురువారం స్వామి వారికి కుటుంబ సభ్యులతో అభిషేకం, సహస్ర నామ అర్చన, మంగళ హారతి, మంత్ర పుష్పం, తీర్థ ప్రసాద వితరణ, నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజలంతా ఆ దత్తాత్రేయ స్వామి ఆశీర్వాదాలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నట్టు తెలిపారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు, శ్రీపాద వల్లభుడైన దత్తాత్రేయ స్వామి వారి ఆలయ క్షేత్రంలో ప్రత్యేక భజనలతో పాటు అన్నదానం నిర్వహించారు.