10-07-2025 05:20:39 PM
నూతనకల్ (విజయక్రాంతి): మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో గురువారం విద్యార్థులకు బోయిళ్ళ క్రాంతి కుమార్ సహకారంతో టై బెల్టులను ఎస్ఐ ప్రవీణ్ కుమార్(SI Praveen Kumar) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు దాతలు ముందుకు వచ్చి సహకారం అందించడం అభినందనీయమని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కొలిశెట్టి యాదగిరి ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు ఉన్నారు.