25-09-2025 12:41:44 AM
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): దైవ అనుగ్రహం అందరి పై ఉండాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని చిన్నదార్పల్లి గ్రామంలో దసరా పండుగ నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన దుర్గామాత అ మ్మవారికి మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలోముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, పార్టీ పట్టాణ అధ్యక్షులు శివరాజ్, మాజీ కౌన్సిలర్ అనంత రెడ్డి, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.