calender_icon.png 25 September, 2025 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి గొప్ప నిదర్శనo

25-09-2025 12:40:56 AM

అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

ఘట్ కేసర్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి) : బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి గొప్ప నిదర్శనమని, పండుగ ద్వారా సమాజంలో సుఖసంతోషాలతో పాటు  మహిళలకు సౌభాగ్యం సిద్ధిస్తుందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు. ఘట్ కేసర్ మున్సిపల్ అవుషాపూర్‌లోని అల్ఫోర్స్ ఐఐటి నీట్ అకాడమీ మైదానంలో బుధవారం వైభ వంగా నిర్వహించిన అల్ఫోర్స్ బతుకమ్మ సంబరాల వేడుకలకు అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

ప్రారంభానికి ముందు ఆయన ప్రాంగణంలో అందంగా ఏర్పాటు చేసిన నవదుర్గ విగ్రహానికి పూజ, శమీ పూజ కార్యక్ర మాన్ని నిర్వహించి బతుకమ్మకు పూజ చేసి వేడుకలను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  బతుకమ్మ పండుగ ద్వారా ప్రకృతిని ఆరాధిస్తామని మరియు ప్రకృతిలో నెలకొన్నటువంటి పలు రుగ్మతులను తొలగించడానికి ప్రతి ఒక్కరూ చేయూతని వ్వాలని సూచిం చారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చడమే కాకుండా వారి యొక్క విషయాలను బతుకమ్మల ద్వారా దుర్గాదేవికి విన్నవించడం జరుగుతుందని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రానికి గొప్ప వైభవాన్ని తెచ్చిపెట్టే పండుగ బతుకమ్మ అని ఈ పండుగ మన దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం చాలా ఉత్సాహంతో జరుపుకుంటారని వారు తెలిపారు. బతుకమ్మ వైభవాన్ని చాటి చెప్పేందుకు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఆకాశమే హద్దుగా వేడుకలను నిర్వహించుకోవడం హర్షించదగ్గ విషయమని వారు చెప్పారు.

వేడుకుల సందర్భంగా ప్రదర్శించినటువంటి పలు నృత్యాలు, కోలాటలు, పాటలు ప్రత్యేక ఆకర్షణగా ఉండడమే కాకుండా బతుకమ్మ వైభవాన్ని చాటి చెప్పాయి. కార్యక్రమంలో వివిధ కళాశాల ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపల్స్,  అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.