calender_icon.png 25 September, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీఎస్టీపై వ్యాపారులతో ఎంపీ ఈటల ముఖాముఖి

25-09-2025 12:42:01 AM

మేడ్చల్, సెప్టెంబర్ 24(విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబులు తగ్గించిన నేపథ్యంలో స్థానిక పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ బుధవారం మేడ్చల్ మార్కెట్లో పర్యటించారు. దుకాణాలలో యజమానులతో మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపుతో వ్యాపారంలో మార్పులు ఎలా ఉన్నాయి, ప్రజాస్వందన ఎలా ఉందని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుతో పేద ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ బిజెపి అధ్యక్షురాలు శైలజ హరినాథ్, మేడ్చల్ రూరల్ జిల్లా మాజీ అధ్యక్షుడు విక్రం రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ అమర మోహన్ రెడ్డి, పాతూరి సుధాకర్ రెడ్డి, బట్టు నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ మురళీధర్ గుప్తా, పాతూరి ప్రభాకర్ రెడ్డి, చెరువు కొమ్ము శ్రీనివాస్ గౌడ్, ఎల్లంపేట మున్సిపల్ అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్, జాకట ప్రేమ దాస్, వంశీ విజయ్, మైసరి రాజు, సర్వేశ్వర్ రెడ్డి,  మల్లేష్ యాదవ్, దోసడి రామచంద్రారెడ్డి, హేమలత రెడ్డి, తోట అనిత, సకర బోయిన వెంకటేష్ ముదిరాజ్, రాగం అర్జున్, బొజ్జ రాఘవరెడ్డి, అవినాష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.