04-09-2025 12:20:13 AM
నాగోల్ సీఐ మక్బూల్ జాని
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): సకల విఘ్నాలకు అధిపతి అయిన ఆ గణనాథుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ ఆనందకరమైన జీవనాన్ని గడపాలని నాగోల్ సీఐ మక్బూల్ జాని అన్నారు. నాగోల్ డివిజన్ కేంద్రం బండ్లగూడ రామాలయం హనుమాన్ టెంపుల్ సన్నిధిలో బుధవారం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రతి ఏడాది శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వైభోపేతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం శుభ పరిణామం అన్నారు. గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించుకోవాలని కమిటీ సభ్యులకు ఆయన సూచించారు. అనంతరం సు మారు రెండు వేల మందికి మహాఅన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్య క్రమంలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు చెరుకు భవానీశంకర్ గౌడ్, నూనెముంతల రాఘవేందర్ గౌడ్, రాఘవేందర్ గౌడ్, మురళి గౌడ్, అరుణ్ కుమార్, మురళీ, సాయి బాబా గౌడ్, నూనెముంతల నాగేందర్ గౌడ్, రాము గౌడ్, అరవింద్ గౌడ్, మనోజ్, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.