09-09-2025 03:09:06 PM
సదాశివనగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో బిజెపి శాఖ మండల అధ్యక్షులు కుంట రాంరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి(Prime Minister Narendra Modi) చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పేద ప్రజల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని పన్నుల భారమైనటువంటి భారాన్ని GSTతగ్గించి నందుకు, భారత ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కృతజ్ఞతలు తెలుపుతూ సదాశివనగర్ మండల బిజెపి శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు అమృత భూంరావు, చక్రదర్ గౌడ్,జిల్లాల రమేష్ రెడ్డి, జిల్లా నాయకులు గంగారెడ్డి, పొలాబోయిన సాయిలు, మాజీ ప్రధాన కార్యదర్శి మార రమేష్ రెడ్డి,మండల ఉపాధ్యక్షులు ఏనుగు జైపాల్ రెడ్డి, గంగాధర్,ఓబీసీ మోర్చా అధ్యక్షులు కటికే రమేష్,భూత్ అధ్యక్షులు ధర్మారెడ్డి, వంశీ, సుభాష్ రెడ్డి,నారాయణ రెడ్డి, సీనియర్ నాయకులు రాఘవరెడ్డి, రాజమౌళి, సుదర్శన్ రెడ్డి, ఆశన్న బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.