09-09-2025 03:03:19 PM
సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మారపల్లి మల్లేష్.
చిట్యాల(విజయక్రాంతి): అంగన్వాడీ కేంద్రాలకు నూతన భవనాలను(Anganwadi centers) మంజూరు చేయాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి మారపల్లి మల్లేష్ అన్నారు.ఈ మేరకు ఆయన సిపిఐఎంఎల్ జిల్లా కమిటీ తో కలిసి మంగళవారం జిల్లా సంక్షేమ ప్రధాన అధికారి మల్లీశ్వరి కి వినతిపత్రాన్ని అందజేశారు. సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కొన్ని అంగన్వాడి కేంద్రాలకు నూతన భవనాలు లేక అద్దె భవనాల్లో నడుపుతున్నారని తెలిపారు. మరికొన్ని అంగన్వాడి కేంద్రాలు శిథిలావస్థలో ఉన్నాయని, తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐసీసీటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కన్నూరి డానియల్ పాల్గొన్నారు.