calender_icon.png 9 September, 2025 | 9:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్షేడ్ డివిజన్ తీరనున్న కరెంట్ కష్టాలు

04-09-2025 12:19:10 AM

కొత్తపల్లి ,సెప్టెంబర్03(విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థలో ఇటీవల విలీనమైన దుర్శేడ్ గోపాలపూర్, బొమ్మకల్, నల్లగుంటపల్లి, గ్రామాలకు సంబంధిం చిన విద్యుత్ ముగ్ధంపూర్ సబ్ స్టేషన్ నుండి సప్లై చేస్తున్నారని.. దానివల్ల ఓవర్ లోడ్ ద్వారా ఆయా గ్రామాలకు ఉదయం మరి యు సాయంత్రం వేళలో విద్యుత్ కి అంతరాయం ఏర్పడుతుందని అదేవిధంగా రైతు లకు నాణ్యమైన విద్యుత్తు రాక ఇబ్బందులు పడుతున్నారని వారి సమస్యలను గత జూన్ నెలలో కరీంనగర్ డివిజన్ ఎస్ సి ఈ కి దుర్శేడ్ మాజీ ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్ రావు వినతి పత్రాన్ని అందించారు..

విలీనమైన గ్రామాల్లో విద్యుత్తు కష్టాలు నెలకొన్నాయని.. గతంలో ఆయా గ్రామాలకు సంబంధించిన కోట్ల రూపాయల విలువైన రైతుల భూములను గతంలోనే దుర్శేడ్ సబ్ స్టేషన్ కి ఇచ్చారని.. ఐనాకూడా దుర్శేడ్ సబ్ స్టేషన్ నుండి విద్యుత్ సరఫరా అందించ లేదని కావున ఇప్పటికైన దుర్శేడ్ సబ్ స్టేషన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఖాళీ భూమిలో సబ్ స్టేషన్ ఏర్పాటు చెయ్యవంసిందిగా ఎస్ ఈ కి వినతిపత్రం సమర్పించారు.

ఈ నేపథ్యంలో విద్యుత్ అధికారులు స్పందించి సబ్ స్టేషన్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు. ఈ సందర్భంగాగ్రామస్తులు తరుపున బుధవారం కరీంనగర్ లోని ఎస్ ఈ ని కలిసి సబ్ స్టేషన్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా పుష్పగుచ్చాన్ని అందిం చి శాలువాతో సత్కరించారు. 

ఈ సందర్భంగా దుర్శేడ్ ఉప సర్పంచ్ సుంకిశాల సం పత్ రావు మాట్లాడుతూ. దుర్శేడ్ డివిజన్ కు సబ్ స్టేషన్ మంజూరు చేసినందుకు.. టీజీ ఎన్ పీడీసీఎల్ సీఎండీ కి. కరీంనగర్ అధికారులకు విద్యుత్ సిబ్బందికి కృతజ్ఞతలుతెలిపారు.