09-09-2025 03:04:41 PM
ఏఓ బోగేశ్వర్ పై చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్
చేర్యాల: రైతులు(Farmers ) యూరియా కోసం విసుగు చెంది రోడ్డు ఎక్కిన పరిస్థితి మంగళవారం చేర్యాల పట్టణంలో జరిగింది.వివరాల్లోకి వెలితే నాయకులకు చాటుగా టోకెన్లు ఏఓ బోగేశ్వర్ ఇస్తున్నాడని ఇలా చేయడం వల్ల సామాన్య రైతులకు యూరియా దక్కడం లేదని ఆవేదన చెంది చేర్యాల పట్టణలో నేషనల్ హైవే పై ధర్నా చేశారు.గత కొన్ని రోజుల నుంచి తిరుగుతున్నా కూడా మాకు టోకెన్లు ఇవ్వడం లేదని ఇచ్చినా కూడా యూరియా ఐపోయింది అని అంటున్నారు అని రైతులు తెలుపుతు ఏఓ బోగేశ్వర్ పైన తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.విషయం తెలుసుకున్న జిల్లా వ్యవస్యాయ అధికారిని రాధిక రైతులతో మాట్లాడుతు ఇప్పటినుంచి అందరికి యూరియా బస్తాలు అందేవిధంగా చూస్తా అని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.