09-09-2025 03:06:08 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్( విజయ క్రాంతి): తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుల జిల్లా కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర సంఘం పిలుపుమేరకు జిల్లా పౌర సంబంధాల అధికారి వై సంపత్ కుమార్ అధ్యక్షతన ఎన్నికలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా గుడిసెల బాపు,గౌరవ అధ్యక్షుడిగా మోహన్ నాయక్,ఉపాధ్యక్షురాలుగా వెన్నెల,ప్రధాన కార్యదర్శిగా పురుషోత్తం,కోశాధికారిగా సోమశేఖర్,సహాయ కార్యదర్శిగా శిరీషలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా డిపిఆర్ఓ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు.