calender_icon.png 9 September, 2025 | 8:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

09-09-2025 03:31:08 PM

దేవరకొండ: బీజేపీ దేవరకొండ మున్సిపల్ శాఖ అధ్యక్షులు వస్కుల సుధాకర్(Vaskula Sudhakar) ఆధ్వర్యంలో జిల్లా  పార్టీ పిలుపుమేరకు మంగళ వారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy ) దిష్టిబొమ్మ ను బీజేపీ నాయకులు దహనం చేశారు.అనంతరం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి సురేష్ మాట్లాడుతూ వినాయక నిమజ్జనం సందర్బంగా నల్గొండలో జరిగిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన రాజకీయ ప్రసంగం,ఇతర మతస్థుల గురించి గొప్పలు చెప్పడం ఏమిటని ప్రశ్నించిన బిజెపి నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్ది ను ఆరెస్ట్ చేయడం సిగ్గు చేటని వారు అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హిందువుల మనోభావాలకు కనీసం గౌరవించకుండా వినాయక ఉత్సవాలకు,నిమజ్జనానికి అడుగడుగునా ఆటంకాలు సృష్టించిందని అన్నారు.ఈ కార్యక్రమంలో  బెజవాడ శేఖర్, గుండా అంజయ్య  ఇడం రవికుమార్,    సముద్రాల సహదేవుడు, చిత్రాలనాగేంద్ర ,చిలకరాజు బిక్కు,కాసుల శంకర్ చండిశ్వర్ ,రెడ్ది శంకర్ అర్థం రమేష్, సంపంగి తదితరులు పాల్గొన్నారు.