09-09-2025 03:11:26 PM
చిట్యాల(విజయక్రాంతి): స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన మిత్రబృందాన్ని పలువురు అభినందించారు.చిట్యాల జడ్పీ హైస్కూల్‌లో 2004 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు తమతో కలిసి చదువుకున్న స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచారు.గోపాలపురం గ్రామానికి చెందిన సాధువెళ్ళి కృష్ణమూర్తి గత కొన్ని నెలల క్రితం మృతి చెందాడు.అతనికి భార్య,కుమార్తె ఉన్నారు.అతని మృతితో కుటుంబ సభ్యులు నిరాశ్రయులయ్యారు. విషయం తెలుసుకున్న మిత్రబృందం రూ.15 వేలు సేకరించి మంగళవారం కృష్ణమూర్తి భార్యకు అందజేశారు.తమ స్నేహితుడి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో దుగ్యాల రమేష్,ఏకు కిషన్,చింతల రాజేందర్,బుర్ర వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.