calender_icon.png 9 September, 2025 | 8:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ చైతన్య స్ఫూర్తి కాళోజీ

09-09-2025 03:29:14 PM

ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు

మహబూబాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రజల చైతన్య స్ఫూర్తి కాళోజీ నారాయణరావు అని, కాళోజి రచనలతో తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలిపారని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు(MLC Takkallapalli Ravinder Rao) అన్నారు. కాళోజి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కాళోజి  జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు ఎన్.వెంకట్ రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి  రవీందర్ రావు హాజరై మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు తెలంగాణ కోసం జరిగిన అనేక ఉద్యమాలలో పాల్గొనటమే కాకుండా, తన సాహిత్యం ద్వారా తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేసిన గొప్ప ప్రజా కవి అని అన్నారు.

కాళోజీ జయంతిని పురస్కరించుకొని పాఠశాల, కళాశాల స్థాయిలలో ఉపన్యాసం, వ్యాసరచన పోటీలు నిర్వహించి, పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ఎమ్మెల్సీ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్ డోలి సత్యనారాయణ, గౌరవ సలహాదారులు మైస నాగయ్య, ప్రధాన కార్యదర్శి పట్టాభి లక్ష్మయ్య, కోశాధికారి సోమ విష్ణు వర్ధన్, బాలికల కళాశాల ప్రిన్సిపాల్ పొక్కుల సదానందం, హెల్త్ డిపార్ట్మెంట్ క్షయ వ్యాధి నిర్మూలన ప్రోగ్రామ్ ఆఫీసర్ విజయ్ కుమార్, సిహెచ్వో తోట శ్రీనివాస్, మార్నేని వెంకన్న , ఎడ్ల వేణు, పెద్ది వెంకన్న, కోట సుధాకర్, పరమాత్మ చారి, మధుసూదన్ రావు, గోనె శ్యాం రావు, రాచకొండ ఉపేందర్, కోడెం శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, మద్దెర్ల రాజన్న, శ్రీహరి, నేతుల వెంకన్న, తోలం వెంకటేశ్వర్లు, జి. వెంకటేశ్వర్లు, జగదీష్, దామోదర్, నరసింహ రావు, సజ్జన వెంకటేశ్వర్లు, వీరేందర్, దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి , కోచ్ దాక్షి తదితరులు పాల్గొన్నారు.