09-09-2025 03:22:07 PM
పెద్దకొడఫ్గల్, (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద మంగళవారం బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు మల్లయల సుభాష్ ఆధ్వర్యంలో జీఎస్టీ తగ్గించినందుకు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశ వ్యాప్తంగా పన్ను భారాన్ని తగ్గించే ప్రయత్నంలో ప్రధాని మోదీ ఆగస్టు 15 శుక్రవారం రోజున 79వ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో తదుపరితరం జీఎస్టీ సంస్కరణలను ప్రకటించారు 2025 దీపావళి నాటికి జీఎస్టీ సంస్కరణలు అమలు చేయవచ్చునని ప్రధాని మోడీ చెప్పడం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జీఎస్టీ నిర్మాణంలో ఒక పెద్ద మార్పుకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఉన్న నాలుగు జీఎస్టీ స్లాబులను తగ్గించడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది ప్రస్తుతం నాలుగు స్లాబులను 5శాతం నుండి 12 శాతం .18 శాతం నుండి 28 శాతం ఈ స్లాబులను కేవలం రెండు స్లాబ్ లోకి మార్చడం జరిగింది.
ఈ స్లాబ్లను 12శాతం ఉన్న స్లాబ్ లోని 99 శాతం వస్తువులు ఐదు శాతం లోకి మారుతాయి. 28 శాతం స్లాబ్ లోని 90 శాతం వస్తువులు 18 శాతానికి మారుతాయని కేంద్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. ఈ విధంగా నిత్యవసర వస్తువుల ధరలు తగ్గుతాయని పేద మధ్య తరగతి కుటుంబాలకు ఊరట కలుగుతుందని ముఖ్యంగా ఆరోగ్య జీవిత భీమాలతో పాటు 33 రకాల అత్యవసర మందులపై 0 శాతం జీఎస్టీ ఒక విప్లవాత్మక నిర్ణయమని విద్యా రంగ సామగ్రి పై 0 శాతం జీఎస్టీ, వ్యవసాయ రంగానికి 18 శాతం నుండి 5 శాతం తగ్గింపుతో నూతన ఉరవడికి శ్రీకారం చుట్టపోతున్నామని ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 28 శాతం నుండి 18 శాతానికి తగ్గింపు ఇది రాబోయే నూతన సాంకేతిక రంగానికి మరింత అభివృద్ధి చెందేలా ఉపయోగపడుతుందని ప్రధాని మోడీ ఆర్థిక సంస్కరణలు ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉన్నాయని 11 ఏళ్ల మోడీ పాలనలో ఎన్నో విప్లవాత్మక విజయాలు అందులో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుండి అతి తొందర్లో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపు మారుతుందని మేక్ ఇన్ ఇండియా లో భాగస్వాములు అవుతూ దేశ ఉత్పత్తులు పెంచి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలన్న మోడీ సంకల్పానికి తోడ్పడుదామని భారత్ ను ప్రపంచ దేశాల్లో అగ్ర దేశంగా నిలబెట్టే దిశగా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మల్లయల సుభాష్ ,సంజయ్, పటేల్ ,జిల్లా కౌన్సిల్ మెంబర్ కృష్ణ పంతులు,ధర్మేంద్ర , ఉమాకాంత్,ఇందళ్ సింగ్, రామగౌడ్,రాజు ,అశోక్, అరుణ్, తానాజీ, రమేష్,వెంకట్ జగపతి .శ్రీను .శివాజీ. జేథిరం నాయక్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు