calender_icon.png 14 January, 2026 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీధి కుక్కల నియంత్రణకు చర్యలు

14-01-2026 02:24:44 AM

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి 

ఎల్బీనగర్, జనవరి 13 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు కుక్కల బెడద లేకుండా చూడాలని అధికారులను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదేశించారు. మాన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని సహా రా ఎస్టేట్స్ కాలనీ, వీరన్నగుట్ట కాలనీలో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెటర్నటి అధికారు లను సమావేశానికి పిలిచి,  కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

అనంతరం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఫత్తుల్లాగూడలోని జంతు కేంద్రంలో దాదాపు 650 కుక్కలను సంరక్షణ చేస్తున్నారని తెలిపారు. ఆపరేషన్ చేసిన కుక్కలను అడవుల్లో వదలాలని అధికారులను కోరారు. రాబోయే రోజుల్లో కుక్కకాటు బారి న ఏ ఒక్కరు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ జోనల్ వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, బీఆర్‌ఎస్ హయత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్, నాయకులు సింగిరెడ్డి మల్లీశ్వరి రెడ్డి, కోసనం ధనలక్ష్మి, జక్కిడి రఘువీర్ రెడ్డి, రుద్ర యాదగిరి, విజయ్ భాస్కర్ రెడ్డి, చంద్రారెడ్డి, అనిల్ కుమార్, కేకేఎల్ గౌడ్, వెంకన్న, పారంద నర్సింగ్, సురేశ్,  వెటర్నరీ అధికారులు రవిచంద్ర, యాదగిరి, అగ్నివేశ్  తదితరులు పాల్గొన్నారు.