30-09-2025 04:41:09 PM
తాండూరు: అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజున మాంసం విక్రయాల దుకాణాలు మూసివేయాలని మాంసం వ్యాపారులకు మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆ రోజున మాంసం తెరిచి వ్యాపారం చేస్తే కఠిన చర్యలతో పాటు లైసెన్సులు రద్దు చేసి భారీ జరిమానాలు విధిస్తామని మున్సిపల్ అధికారులు జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు.