30-09-2025 04:39:05 PM
జనగామ (విజయక్రాంతి): జనగామ జిల్లా చిల్పూర్, మండలం చిన్న పెండ్యాల, గ్రామానికి చెందిన గుంపుల రామ్మోహన్ రెడ్డి, శిరీషల కుమారుడు అశ్వతేజ్ రెడ్డి, ఇటీవల జఫర్గడ్ మండలం కూనూర్ గ్రామంలో నిర్వహించిన 44వ సబ్ జూనియర్ బాల్ బ్యాట్మెంటన్, పోటీలలో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై తమిళనాడు, దిండిగల్ లో జరిగిన బ్యాడ్మింటన్ పోటీలలో తెలంగాణ టీం నుండి పాల్గొని మూడవ స్థానంలో నిలిచారు.
ఈ విజయానికి కృషి చేసిన తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యానికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ, జనగామ జిల్లా బాల్ బ్యాట్మెంటన్ అధ్యక్షులు గాదెపాక అయోధ్య, ప్రధాన కార్యదర్శి నీరటి ప్రభాకర్, కోశాధికారి కాటం రాజి రెడ్డి,కోచ్ ముచ్చ సుధాకర్ రెడ్డి, ఇంత అద్భుత ప్రతిభ కనబరిచిన అశ్వతేజ్ రెడ్డిని ముందు ముందు ఇంకా మంచి స్థాయికి ఎదగాలని జాతీయస్థాయిలో ఇంకా రాణించాలని అభినందించారు.