calender_icon.png 30 September, 2025 | 7:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయులకు విధులు పారదర్శకంగా కేటాయించాలి

30-09-2025 04:55:39 PM

చిట్యాల (విజయక్రాంతి): స్థానిక ఎన్నికలలో ఉపాధ్యాయులకు విధులు కేటాయించడంలో పారదర్శకత వహించాలని టీఎస్ యుటిఎఫ్ నాయకులు స్థానిక ఎన్నికల అధికారి ఎంపీడీవోకు మంగళవారం తెలిపారు. స్థానిక సంస్థల జడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో ఉపాధ్యాయులకు విధులు కేటాయించడంలో సీనియారిటీ, పారదర్శకతను ప్రాతిపదికగా తీసుకొని విధులు కేటాయించాలని సహాయ ఎన్నికల అధికారి ఎంపీడీఓ, మండల విద్యాధికారి ఎంఈఓకు మండల కేంద్రంలో జరిగిన ప్రెసిడెంట్ అధికారులు, సహాయ ప్రెసిడెంట్ అధికారులు శిక్షణ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ చిట్యాల మండల శాఖ తరపున ప్రాతినిధ్యం వహించారు.

విద్యాశాఖకు సంబంధించిన ఉపాధ్యాయులకు కేటాయించే విధుల్లో మండల విద్యాధికారి ప్రమేయం లేకుండానే ఎన్నికల ఉత్తర్వులు వస్తున్నాయని, ఇది సరైనది కాదని సహాయ ఎన్నికల అధికారి యొక్క దృష్టికి తీసుకువెళ్లారు. ఉపాధ్యాయ సిబ్బందికి విధుల కేటాయింపులు మండల విద్యాధికారి సూచించిన ప్రకారమే జరగాలని, ఎలాంటి అక్రమాలకు తావివ్వకూడదని, ఈ సందర్భంగా వారి దృష్టికి తీసుకువెళ్లారు. దానికి ఎంపీడీవో స్పందిస్తూ అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ చిట్యాల మండల అధ్యక్షుడు ఏశమల్ల నాగయ్య, ఉపాధ్యక్షులు రంగా రామలింగయ్య జానకి, పూర్వ అధ్యక్షులు బొప్పని యాదయ్య, కార్యదర్శులు ఎ. చంద్రశేఖర్, పి. శ్రీనివాస్, జి. షంబయ్య, ఎండీ. సాదిక్ తదితరులు పాల్గొన్నారు.