11-07-2025 12:16:07 AM
కొత్తపల్లి, జూలై 10 (విజయ క్రాంతి): ఇటీవల ఎస్‌ఐపి అబాకస్ అకాడమీ హైదరాబాదులో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో ఆల్ఫోర్స్ ఈ టెక్నో పాఠశాలకు చెందిన ఇ.అన్విత, మొదటి స్థానంతో పాటు నగదు బహుమతి, జి మ.హర్షిత్ రజత పతాకాన్ని, ఎండీఏ మొదటి రన్నర్తోప్ పాటు సర్టిఫికెట్లు, మెడల్స్ అందుకున్నారు.
రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థులను ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి పుష్పగుచ్చాలు అందించి, సర్టిఫికెట్లను ప్రదానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు, విద్యార్థులుపాల్గొన్నారు.