11-07-2025 12:13:59 AM
కొత్తకోట జులై 10 : కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల నుండి మాకు ప్రాణహాని ఉందని వారి నుండి మాకు రక్షణ కల్పించాలని కోరుతూ గురువారం కొత్తకోటలో బిఆరెస్ నాయకులు అంబే ద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా బిఆరెస్ నాయకులు మాట్లాడుతూ ఇటీవల నుండి సోషల్ మీడియా లో వస్తున్నా కౌంటర్లపై మీ కాంగ్రెస్ నాయకులు బిఆరెస్ నాయకులపై భౌతిక దాడులు చేస్తామని అంటున్నారని వారి నుండి మాకు రక్షణ కల్పిచాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
రాజ్యాంగ బద్దంగా మీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని మమ్మల్ని రెచ్చేకొట్టే వ్యాఖ్యలు చేస్తూ మమ్మల్ని భయబ్రాంతులకు గురి చేయడం తగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆరెస్ మండల అధ్యక్షులు వామన్ గౌడ్, మాజీ సీడీసీ చైర్మన్ చెన్నకేశవ రెడ్డి, పట్టణ అధ్యక్షులు బాబు రెడ్డి, మాజీ కౌన్సిలర్లు ఖాజామైనొద్దీన్, అయ్యన్న, రవీందర్ రెడ్డి, ఆకుల శ్రీను, పద్మ నెహ్రు, శ్రీనుజీ, సాజీద్, వసీం, శాంతిరాజ్, సత్యం యాదవ్, వినోద్, బాబ, అద్వానీ శ్రీను, రవి, తిమ్మన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.