11-07-2025 12:16:18 AM
ఎమ్మెల్యే డాక్టర్ పర్ణికరెడ్డి
నారాయణపేట, జూలై 10 (విజయ క్రాంతి): రక్తదానం చేసి ప్రాణదాతలుగా, నిలవాలని ఎ మ్మెల్యే డాక్టర్ పర్ణిక రెడ్డి , జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నా రు.గురు పూర్ణిమ సందర్భంగా స్నేహ మిత్ర మండలి ఆధ్వర్యంలో షిరిడి సాయి మందిరంలో జరిగిన రక్తదాన శిబిరాన్ని ఎ మ్మెల్యే పర్ణిక రెడ్డి ప్రారంభించారు. గత 9 సంవత్సరాలుగా రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న 1985 - 87 ఇంటర్మీడియట్ బ్యాచ్ కు చెందిన స్నేహ మిత్ర మండలి సభ్యులను అభినందించారు,రక్తదాన శిబిరాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ రక్తదాతలను అభినందించారు,ప్రస్తుత స్థితులలో రక్తదానం చేయవలసిన అవసరాన్ని గుర్తు చేశారు.
ఈ రక్తదాన శిబిరాన్ని సందర్శించిన మక్తల్ మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రక్తదాన కార్యక్రమాలను మరియు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న స్నేహ మిత్ర మండలి సభ్యులను అభినందించారు,ఈ శిబిరంలో 72 యూనిట్ల రక్తం రక్తదాతల నుండి సేకరించారు,ఈ కార్యక్రమంలో స్నేహ మిత్ర మండలి సభ్యులు డాక్టర్ డి మదన్ రెడ్డి ,డాక్టర్ బాలాజీ సింగాడే ,డి మల్లేష్, టౌన్ బిల్డర్ వెంకట్ రాములు, గుత్తి రమేష్, సైదప్ప ,గోపాలకృష్ణ ,జగన్నాథ్, విజయ్ కుమార్, చంద్రశేఖర్ రెడ్డి,SI ఆంజనేయులు, తరుణ్ రామ్ ,మిర్చి వెంకటయ్య , హనుమంతు, షిరిడి సాయి హనుమాన్ మందిరం సభ్యులు బాలాజీ సతీష్, దిలీప్ కుమార్ ,నందు పటేల్ , జొన్నల్ జయంత్ రెడ్డి,ఇండియన్ రెడ్ క్రాస్ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డిపాల్గొన్నారు.