calender_icon.png 23 January, 2026 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆత్మాభిమానానికి ప్రతీక మేడారం

23-01-2026 12:46:31 AM

  1. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

సమ్మక్క సారక్కల దర్శనం

నిలువెత్తు బంగారం సమర్పణ

హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మలను గురువారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దర్శించుకున్నారు. వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. అడవిబిడ్డల ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపాలైన సమ్మక్క--సారలమ్మ తల్లులను దర్శించుకోవడం గర్వకారణమని ఈ సందర్భంగా మల్లన్న గారు తెలిపారు.

అనంతరం సంప్రదాయ రీతిలో ఎత్తు బంగారం సమర్పించి తల్లుల ఆశీర్వాదం పొందారు. మేడారం జా తర గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. అలాగే ములుగు జిల్లా పరిధిలో ఉన్న కొన్ని గిరిజన గూడాలను సంద ర్శించి వారి స్థితిగతులను తెలుసుకొని వారి జీవనశాలి ఎలా ఉంటుందో వారితో మా ట్లాడి తెలుసుకున్నారు.

మేడా రం జాతరకు ఆర్టీసీ బస్సులో చేరుకున్నారు. ప్రయా ణ సమయంలో తోటి ప్రయాణికులతో ఆప్యాయంగా పలకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయనవెంట టీఆర్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లు సుదగాని హరిశంకర్ గౌడ్, మాదం రజనీ కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్, పల్లెబొయిన అశోక్ ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్లబొయిన ఓదేలు యాదవ్,

రాష్ట్ర కార్యదర్శులు భావన వెంకటేష్, పసల ప్రసన్న కుమారి, బస్వాపురం నగేష్ ముదిరాజ్, కొమ్ముల ప్రవీణ్ రాజ్, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్, రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజా గౌడ్, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి వీరమల్ల అనిల్, హనుమకొండ జిల్లా అధ్యక్షు డు బత్తిని వెంకటేష్ గౌడ్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు పి. సంపత్ పటేల్, మెదక్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి గౌడ్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, మహేష్‌గౌడ్ తదితరులు ఉన్నారు.

ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణమా?

మేడారం దర్శనం కార్యక్రమంలో భాగంగా మార్గమధ్యంలో ఉండగా ఎమ్మె ల్సీ తీన్మార్ మల్లన్నకు మల్లంపల్లి గ్రామ కంఠం ప్రభుత్వ భూమిని రెడ్డి నాయకులు కబ్జా చేశారనే సమాచారం తెలుసుకున్నారు. వెంటనే ఆ స్థలానికి చేరుకున్న ఆయన.. ప్రభుత్వ భూమిపై జరుగుతున్న అక్రమ నిర్మాణాన్ని తక్షణమే ఆపేలా చర్య లు తీసుకోవాలని ములుగు తహసీల్దార్, డీపీవోకు ఫోన్ ద్వారా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల భూమి దోచుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.