23-01-2026 12:45:57 AM
ఘట్ కేసర్, జనవరి 22 (విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఫార్మసీకి చెందిన పీహెచ్.డి. పరిశోధన విద్యార్థిని పూజా అగర్వాల్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్లో తన పీ.హెచ్.డి. పట్టాను విజయవంతంగా పొందారు. ఈపరిశోధన స్కూల్ ఆఫ్ ఫార్మసీ డీన్ డాక్టర్ వసుధాబక్షి పర్యవేక్షణలో పూర్తయింది. జనవరి 19న నిర్వహించబడిన ఈ పరీక్షకు మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ ముతాలిక్, డీన్ డాక్టర్ సతీష్ కుమారన్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సికందర్ బాబా, రిజిస్ట్రార్ (ఇన్చార్జ్) డాక్టర్ ఏ. పద్మనాభరావు తదితర అధ్యాపకులు, పరిశోధకులు హాజరయ్యారు.