calender_icon.png 10 January, 2026 | 11:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిఘా నీడలోకి మేడారం జాతర

10-01-2026 12:00:00 AM

ములుగు ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకాన్

ములుగు,జనవరి9(విజయక్రాంతి): ములుగు జిల్లా మేడారంలో జరుగుతున్న మహ జాతరలో భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణ, ఎలాంటి అనూహ్య సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సీసీటీవీ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. జాతర సమయంలో భారీగా రద్దీ దృశ్య ప్రధాన ప్రాంతాలైన జంపన్నవాగు గద్దెలు, హరితా వై జంక్షన్, ముఖ్య ట్రాఫిక్ మార్గాలు కూడళ్ళు, రద్దీ ప్రాంతాలు తదితర కోర్ పాయింట్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి దృశ్య ఈ సారి మునుపటి కన్నా ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భద్రతను బలోపేతం చేసే దిశగా జాతర మొత్తాన్ని సీసీటీవీ నిఘాలో ఉండే విధంగా సీసీటీవీలు అమర్చడం జరుగుతుంది.