10-01-2026 12:00:00 AM
నిజామాబాద్ రూరల్, జనవరి 9 (విజయ క్రాంతి): నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్ తండాకు చెందిన నెనవత్ తోప్య ముత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఆరోగ్యం క్షీణించడంతో ఇటీవల నిమ్స్ ఆస్పత్రిలో చేరారు.
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం స్థానిక కాంగ్రెస్ నాయకులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి తెలియజేయడంతో స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.6,00,000 ఎల్‌ఓసీని మంజూరు చేయించారు. ఎమ్మెల్యే సహాయంతో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబ సభ్యులు భూపతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.