calender_icon.png 25 January, 2026 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహా అద్భుతం

25-01-2026 12:00:00 AM

ప్రతి రెండేళ్ల కోమారు నిర్వహించే మేడారం సమ్మ క్క సారలమ్మ మహాజాతర వైభోగం మహా అద్భుతంగా నిలుస్తోంది. మాఘశుద్ధ పౌర్ణమి రోజు నుంచి నాలుగు రోజులపాటు భక్త‘కోటి’తో మారుమూల అటవీ గ్రామ మైన మేడారం మినీ భారత్‌గా మారుతుంది. అత్యధిక సంఖ్యలో గిరిజనులు, గిరిజనేతరులు హాజరయ్యే ఈ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా గుర్తిం పు పొందింది. గుడీగోపురం లేకుండా కేవలం కుంకుమ భరిణలో ‘గద్దె’లపై ప్రతిష్టించే దేవతలను కొలవడం విశేషం. లక్షలాది మంది భక్తులు మేడారం పరిసర అటవీ ప్రాంతంలో తాత్కాలికంగా గుడారాలు వేసుకొని నివసిస్తారు. లక్షల వాహనాలు మేడారం జాతరకు వస్తాయి. ఈసారి కనీసం ఐదు నుంచి ఏడు లక్షల వరకు ప్రైవేటువాహనాలు జాతరకు వస్తాయని అంచ నా వేస్తున్నారు. ప్రత్యేకంగా మేడారంలో ప్రైవేట్ వాహ నాలకు పార్కింగ్ సౌకర్యం కల్పిస్తారు.

100 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో తాత్కాలికంగా అతిపెద్ద ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేస్తారు. సాధారణ సమయంలో అత్యధిక బస్సులు నడిపే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని మహాత్మా గాంధీ బస్టాండుకు మించి మేడారం ఆర్టీసీ బస్టాండ్ ద్వారా 3,800కు పైగా ఆర్టీసీ బస్సులు రాష్ట్ర నలుమూలలకు నడుపుతారు. భక్తులకు అత్యవసర వేళల్లో వైద్యం కోసం ప్రత్యేక వసతులతో కూడిన మూడు పెద్ద ఆస్పత్రులను నిర్వహించడం జరుగు తుంది. జాతర ప్రాంగణంలో వివి ధ రకాల వస్తువులతో పాటు ఆట బొమ్మలు, బంగా రం(బెల్లం), కొబ్బరికా యలు, రెస్టారెంట్లు ఇతరత్ర షాపులు పదివేలకు పైగా ఏర్పాటు చేస్తారు.

500కు పైగా హుండీలను ఏర్పాటు చేయడం వల్ల ఎక్కువ హుండీలు ఉండే జాతరగా మేడారం గుర్తింపు పొందింది. జాతరలో వందల కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం జరు గుతుంది. మూడు రోజులపాటు అత్యధికంగా మద్యం, మాంసం వినియో గించే జాతరగా పేరుంది. 1969లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేడారం జాతరను దేవాదాయ శాఖ పరిధిలోకి చేర్చింది. అప్పటి నుంచి పూర్తి అధికార లాంఛనాలతో, ప్రభుత్వ నిధులతో జాతర నిర్వహిస్తు న్నారు. 13 వేలకు పైగా పోలీసులు జాతర బందోబస్తు లో పాల్గొంటున్నారు.

సీఎం స్థాయిలో మేడారం జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సమ్మక్క దేవత చిలకల గట్టు నుంచి మేడారం గద్దెల పైకి తీసుకొచ్చే సమయం లో కలెక్టర్, ఎస్పీ తుపాకీతో ఆకాశంలోకి కాల్పులు జరిపి స్వాగతం పలకడం ఒక మహాద్భుతంగా ఉంటుంది. ములుగు కలెక్టర్, ఎస్పీలతో సహా జిల్లా యంత్రాం గం పూర్తిగా, అనేకమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారు లు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నాలు గు రోజులపాటు ఇక్కడి నుంచే అధికారిక కార్యక్రమాల ను నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని మధ్యప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఝార్ఖండ్, కర్ణాటక, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, గుజరాత్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు, ప్రవాస భారతీయులు సమ్మక్క సారలమ్మ జాతరకు తరలివస్తారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఇక్కడ నిర్వహించే పనుల్లో పాల్గొంటూ వ్యాపారాలు కూడా చేస్తారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి జాతరకు రావడంతో  మేడారం నాలుగు రోజుల పాటు మినీభారత్‌గా మారుతుంది.

బండి సంపత్‌కుమార్, 

మహబూబాబాద్, విజయక్రాంతి