23-01-2026 12:00:00 AM
ములుగు,మంగపేట, జనవరి 22(విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండలంలోని కమలాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా నియమించబడిన మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ చింత చంద్రావతి కి మహిళనాయ కురాళ్లు గురువారం కలిసి వారికి శాలువాతో సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు చిం తా పున్నారావు,మల్లూరు దేవస్థానం డైరెక్టర్ పాయం అనిత, మండల మహిళ అధ్యక్షురాలు శానం నిర్మల, గ్రామ కమిటీ మహిళా అధ్యక్షురాలు మిరియాల శైలజ, గ్రామ కమిటీ ఉపాధ్యక్షురాలు పొలసాని సరళ రాణి, గ్రామ ప్రధాన కార్యదర్శి వడ్లకొండ భాను, సీనియర్ నాయకులు అజ్మీర రాజు, పడమటింటి శ్రీనివాస్, మహిళ ప్రచార కార్యదర్శి ఊర అనిత, మహిళా నాయకురాలు అది రేణుక, చుంచు మమత, అల్లాడి వైష్ణవి, గోమాసు పద్మ, తదితరులు పాల్గొన్నారు.