23-01-2026 12:00:00 AM
నాగల్ గిద్ద, జనవరి 22: మండలం పరిధిలోని కరస్ గుత్తి గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం మండల వైద్యాధికారి డాక్టర్ జివేరి యా బేగం ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కరస్ గుత్తి, ఇరక్ పల్లి పరిధిలో ఉన్న పాఠశాలలో పనిచేస్తున్న కార్మికులు కుమారు 26 మందికి వైద్య పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్ సబితా కుమారి, ఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.