6 July, 2026 | 3:12 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

తునికి నల్ల పోచమ్మను దర్శించుకున్న మేడ్చల్ జడ్జి

09-06-2025 12:58 AM

కౌడిపల్లి(మెదక్), జూన్ 8 :కౌడిపల్లి మండలం జిల్లాలో ప్రసిద్ధిగాంచిన తునికి  గ్రామ శివారులో వెలసిన శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారిని ఆదివారం మేడ్చల్ జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి అర్జున్, ఎన్‌ఐఏ అధికారి విశాల్ గౌతమ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈఓ రంగా రావు, గ్రామ పెద్దలు ఘనంగా పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.

ఆలయ పూజారులు శివప్ప, రాజేష్ ఆలయంలో కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. న్యాయమూర్తి అర్జున్, ఎన్.ఐ.ఏ ఆఫీసర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారి దేవస్థానాన్ని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవస్థానాన్ని సందర్శించుకోవడం సంతోషం వ్యక్తం చేస్తూ, దేవస్థాన నిర్వహణకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి ఎస్‌ఐ రంజిత్ కుమార్ రెడ్డి , జూనియర్ అసిస్టెంట్ వెంకటరెడ్డి కోర్టు కానిస్టేబుల్ దిలీప్, మాజీ ఉప సర్పంచ్ కొండల్ రెడ్డి, మాజీ సర్పంచ్ సాయ గౌడ్ పాల్గొన్నారు.